News July 28, 2024
ఫ్రీ జర్నీతో నెలకు రూ.250 కోట్ల భారం.. రేపు సీఎం సమీక్ష
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం APSRTCలో నిత్యం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట. పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉంది.
Similar News
News January 31, 2025
టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి!
భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, అంతకంటే ఎక్కువ ధరకు డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించడం కామన్. అయితే, పెట్టిన డబ్బులతో పాటు లాభాలను అందించే సినిమాలు అరుదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆ కోవలో చేరింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు కలెక్ట్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలొచ్చాయి. ఈక్రమంలో వీరంతా కలిసి చిత్రయూనిట్‌కు పార్టీ ప్లాన్ చేశారట. ఇలా జరగడం టాలీవుడ్‌లో తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి.
News January 31, 2025
ప్రెసిడెంట్‌పై కామెంట్స్ ఆమోదయోగ్యం కాదు: రాష్ట్రపతి భవన్
ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము బడ్జెట్ ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన <<15319555>>కామెంట్స్<<>> ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘నిజాన్ని ఎవరూ దాచలేరు. ప్రసంగంలో ప్రెసిడెంట్ అలసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదు. అణగారిన వర్గాలు, రైతులు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అలసట రాదు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం’ అని పేర్కొంది.
News January 31, 2025
కాశీలో ‘గంగా హారతి’ నిలిపివేత
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు అట్నుంచి కాశీ విశ్వనాథ ఆలయాన్నీ కవర్ చేస్తున్నారు. దీంతో వారణాసిలో రద్దీ నెలకొనగా ప్రతి రోజు సాయంత్రం ఘాట్ల వద్ద నిర్వహించే ‘గంగా హారతి’ని నిలిపేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్లు, భక్తులు ఆయా ఘాట్ల వద్దకు రావొద్దన్నారు. రద్దీ నేపథ్యంలో కాశీ ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.