News July 28, 2024
నేడు రెండో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు 2వ మ్యాచ్ జరగనుంది. రా.7గం.కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా నిన్నటి మ్యాచ్‌లో 43 రన్స్ తేడాతో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది.
Similar News
News January 20, 2026
WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 154/5 రన్స్ చేసింది. సీవర్ బ్రంట్ 45 బంతుల్లో 65* పరుగులతో అదరగొట్టారు. ఓపెనర్ హర్మన్ ప్రీత్ 41 రన్స్ చేశారు. మిగతావారెవరూ రాణించకపోవడంతో MI భారీ స్కోర్ చేయలేకపోయింది. DC బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి 3 వికెట్లతో సత్తా చాటారు. DC టార్గెట్ 155 రన్స్.
News January 20, 2026
TG సీఐడీ సంచలన నిర్ణయం

తెలంగాణ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కేసుల్లో స్టేషన్‌కు రాలేని బాధితులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఫోన్/మౌఖికంగా సమాచారం అందిస్తే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.
News January 20, 2026
నన్ను అడగడం కాదు.. నేనే వాళ్లను ప్రశ్నలడిగా: హరీశ్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నలడగడం కాదని, తానే వాళ్లను చాలా ప్రశ్నలు అడిగానని మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకేంటి సంబంధం. నేను హోంమంత్రిగా చేయలేదు కదా. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడగండి. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడం. నాకు సిట్ నోటీసు ఇవ్వడం కాదు. సీఎం రేవంత్‌కు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యానించారు.


