News July 28, 2024
జడ్చర్ల: తమ్ముడు కనిపించడం లేదని అన్న ఫిర్యాదు

పెట్రోల్ తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కేసు నమోదైన ఘటన జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. విజయ్ కుమార్(27) అనే వ్యక్తి ఆటో డ్రైవింగ్ చేస్తూ భార్య లావణ్యతో జడ్చర్లలో జీవనం సాగిస్తూ ఉండేవారని, బైక్‌కు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తానని తెలిపి రాకపోవడంతో ఆమె బావ నరసింహకు తెలుపగా వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News August 6, 2025
జడ్చర్ల: గల్లంతైన మహిళా మృతదేహం లభ్యం

జడ్చర్ల మండలం నెక్కొండలో బుధవారం ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడి ఓ మహిళా గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు ప్రకారం.. నెక్కొండ గ్రామానికి చెందిన జ్యోతి (34) వ్యవసాయ పనులకు వెళ్తుండగా కాలు జారి గల్లంతయింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని జ్యోతి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి నలుగురు కుమారులు, భర్త ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News August 6, 2025
జడ్చర్ల: వాగులో జారి పడి మహిళా గల్లంతు

వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (35) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 6, 2025
MBNR: సర్కార్ పేటలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సర్కార్ పేటలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహమ్మదాబాద్ 9.5, చిన్నచింతకుంట 11.0, సీసీ కుంట మండలం వడ్డేమాన్ లో 7.3, కౌకుంట్ల 3.8, జడ్చర్ల 3.5, రాజాపూర్ 1.3, మహబూబ్ నగర్ అర్బన్, బాలానగర్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.