News July 28, 2024

HYD: బోనాలకు పటిష్ఠ ఏర్పాట్లు: ఆమ్రపాలి

image

HYD నగరంలో నేడు జరగబోయే బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. జడ్సీలు, డీసీలకు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఇతర ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయాల చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.

Similar News

News October 2, 2024

HYD: పండగల తేదీలు ఫిక్స్ చేసిన ‘శ్వాస్’

image

సనాతన ధర్మ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పండగలు విశేష పర్వదినాల తేదీలను సిద్ధం చేశారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు రాబోయే ‘విశ్వావసు నామ సంవత్సరం-2025-26’లో పండుగల తేదీలను నిర్ణయించినట్లు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) ప్రకటించింది. నిర్ణయించిన పండగల తేదీలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని శ్వాస్ తెలిపింది.

News October 2, 2024

HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

image

HYDలో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్‌గంజ్‌, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.