News July 28, 2024

మెము రైళ్లు రద్దు

image

విజయవాడ, బిట్రగుంట మధ్య ప్రయాణించే మెము రైళ్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు నం.07978 విజయవాడ-బిట్రగుంట, నం.07977 బిట్రగుంట-విజయవాడ రైలును జులై 29 నుంచి ఆగస్టు 4 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News February 2, 2026

నెల్లూరు: ఈ స్కూటీ దొంగ మీకు తెలుసా..?

image

చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి కొడవలూరు మండలం గండవరం గ్రామంలో 29వ తేదీన స్కూటీని దొంగలించినట్లు కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి స్కూటీని అపహరించినట్లు CC ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే వెంటనే 9440796328 ఫోన్ నెంబర్‌కి సమాచారం అందించాలని కోరారు.

News February 2, 2026

కందుకూరు: నేడు కూడా పాత రేట్ల ప్రకారమే భూముల రిజిస్ట్రేషన్

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనవరి 31 తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిటలాడాయి. అయితే అందుకు సంబంధించిన GO ఇంకా రాకపోవడంతో పాత రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జీవో రావడానికి ఇంకో రెండు రోజులు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వాళ్లు భలే ఛాన్సులే అని సంబరపడుతున్నారు.

News February 2, 2026

నెల్లూరు జిల్లాకు కొంత ఊరట.. కొంత నిరాశ!

image

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈసారి నెల్లూరు జిల్లాకు నిరాశే మిగిలింగి. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్, మరే కొత్తదానికి అదనంగా నిధులు ఇవ్వలేదు. చెన్నై-బెంగళూరు కారిడార్(CBIC) పరిధిలోని నెల్లూరు క్రిస్ సిటీని రూ.621Crతో రాష్ట్రప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇప్పటికే రూ.531 Crను కేంద్రం విడుదల చేసింది. మిగిలిన పనుల పూర్తికి రూ.90 Cr కేటాయించే అవకాశం ఉంది.