News July 28, 2024

ప్రభాస్ ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!

image

‘రాజా సాబ్’ అప్‌డేట్ కోసం చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. రేపు సాయంత్రం 5.03 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. ‘ఇక నుండి కుమ్ముడే డార్లింగ్స్. ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రేపు సాయంత్రం తీసుకొస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. పింక్ సూట్‌లో ప్రభాస్ అటువైపుగా తిరిగి ఉన్న పోస్టర్‌ను ఈ సందర్భంగా పంచుకున్నారు.

Similar News

News December 1, 2025

JGTL: T-హబ్‌లో డ్రైవర్లకు అందని బిల్లులు

image

జగిత్యాల T–హబ్లో పనిచేసే డ్రైవర్లకు 8 నెలలుగా బిల్లులు అందటం లేదు. అధికారులను అడిగిన ప్రతిసారి దాటేస్తున్నారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 రూట్లలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000-1500 వరకు శాంపిల్స్ సేకరించి T–హబ్ కు చేరుస్తారు. సోమవారం నుంచి డ్రైవర్లు విధులను నిలిపి వేయడంతో శాంపిల్స్ సేకరణ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సమస్యపై ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

News December 1, 2025

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ షురూ

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD)ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్‌సైట్: <>https://ssc.gov.in/<<>>

News December 1, 2025

కోలుకున్న గిల్, హార్దిక్.. సౌతాఫ్రికాతో టీ20లు ఆడే ఛాన్స్!

image

గాయాల కారణంగా కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. హార్దిక్ T20లలో ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ క్లియరెన్స్ ఇచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గిల్‌కు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో వీరు ఆడే ఛాన్స్ ఉంది. వీరి రాకతో టీమ్ ఇండియా బలం పెరగనుంది.