News July 28, 2024

వీడియో లీక్ చాలా బాధించింది: ఊర్వశీ రౌతేలా

image

నటి ఊర్వశీ రౌతేలాకి సంబంధించిన ఓ క్లిప్ ఇటీవల నెట్టింట వైరల్ అయింది. ఆమె స్నానాల గదిలో దుస్తులు తొలగిస్తున్నట్లుగా ఉన్న ఆ క్లిప్‌ వైరల్ కావడంపై ఆమె స్పందించారు. ‘అది నిజమైన వీడియో కాదు. నేను నటిస్తున్న గుస్పేటియా అనే కొత్త సినిమాలో సీన్. విడుదలకు ముందే ఇలాంటి లీకులు రావడం, అది వైరల్ కావడం చాలా బాధ కలిగించింది. ఇలాంటి చేదు అనుభవం ఏ అమ్మాయికీ ఎదురుకాకూడదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 5, 2025

వీటిని క్లీన్ చేస్తున్నారా?

image

మేకప్‌ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. కానీ వాటిని ఏడాదికోసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే మేకప్‌ అప్లికేషన్‌, బ్లెండింగ్‌ నాణ్యత తగ్గుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మసమస్యలు వస్తాయి. వేడి నీళ్లు, డిష్‌ వాషర్‌ సోప్‌, యాంటి బ్యాక్టీరియల్‌ సోప్‌, బేబీషాంపూతో వాటిని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.

News November 5, 2025

ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

image

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.

News November 5, 2025

ఇది ట్రంప్‌కు వార్నింగ్ బెల్!

image

USలోని పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ట్రంప్ ఏమాత్రం ఇష్టపడని సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ <<18202940>>న్యూయార్క్ మేయర్‌గా<<>> ఎన్నికయ్యారు. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల <<18202619>>గవర్నర్<<>> ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ నెగ్గడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.