News July 28, 2024

గొప్పలు కాదు.. దాడులు అరికట్టండి: వైసీపీ

image

నెల్లూరు జిల్లాలో అత్యాచార ఘటనపై వైసీపీ మండిపడింది. ‘కావలిలో 9 సంవత్సరాల బాలికపై మహబూబ్ బాషా అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేశారు. మీకు మీరు డబ్బా కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు. రాష్ట్రంలో పసిపిల్లలు, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టండి’ అంటూ ట్వీట్ చేసింది.

Similar News

News January 23, 2026

నెల్లూరు: సాగు మొదలైనా.. భూసార నివేదికలు ఎక్కడ?

image

జిల్లాలో వరి సాగు దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా జరుగుతోంది. సాగు మొదలై రెండో నెల అవుతున్నా భూసార నివేదికలు రైతన్నలకు అందలేదు. 31,231 నేల పరీక్షలు లక్ష్యం కాగా 30,785 నమూనాలు సేకరించారు. వీటిలో 23,306 శాంపిల్స్ పరీక్షించగా 14,104 SOIL హెల్త్ కార్డ్స్‌ను అందించారు. నేల స్వభావాన్ని అనుసరించి ఎరువుల వినియోగం జరగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. మిగిలిన కార్డ్స్ అందించే లోపు సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

News January 23, 2026

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి: కలెక్టర్

image

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగుల అందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.