News July 28, 2024
మదనపల్లె కేసు: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. YSRCP మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాషా ఇంట్లో నోటీసులు అందజేసి, ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్ని, పలువురు వైసీపీ లీడర్లను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 1, 2025
జెలెన్‌స్కీ.. బాలక్ బుద్ధి or ధీశాలి?

డొనాల్డ్ ట్రంప్‌తో పెట్టుకొనేందుకు మహా మహా దేశాధినేతలే భయపడుతున్నారు. ఎక్కడ టారిఫ్స్ వేస్తే ఎకానమీ ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అలాంటిది శాంతి ఒప్పందంపై సంతకం చేయకుండా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ వెళ్లిపోవడం అతివిశ్వాసమో ఆత్మవిశ్వాసమో తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లూ అమెరికా డబ్బుతోనే యుద్ధం చేసిన ఆయన ఇప్పుడు ఒంటరిగా పుతిన్‌ను ఎదుర్కోగలరా అని సందేహిస్తున్నారు.
News March 1, 2025
మహా కి’లేడీ’.. రేప్ చేశారని తప్పుడు కేసు పెట్టి!

యూపీకి చెందిన జ్యోతి సాగర్ చేసిన పనికి సభ్య సమాజం ముక్కున వేలేసుకుంది. రెండు నెలల క్రితం తన భర్తతో పాటు అతని స్నేహితులు కారులో తనపై అత్యాచారం చేశారని, సిగరెట్‌తో కాల్చారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కాల్ రికార్డ్స్, CCTV ఫుటేజీ పరిశీలించాక ఆమె చేసిన ఆరోపణలు అబద్ధమని తేలింది. భర్తతో వివాదం ఉండటంతో ఇలా తప్పుడు కేసు పెట్టినట్లు గుర్తించారు.
News March 1, 2025
పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలి: హైకోర్టు

TG: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట దక్కింది. 16 ఏళ్ల లోపు పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. మరోవైపు తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.