News July 28, 2024

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

image

ఎగువ కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం ఉదయానికి ప్రాజెక్టులోకి 23,555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 81.5 TMCలు కాగా.. ప్రస్తుతం 31.917 TMCలకు చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 72.830TMC నీరు నిల్వ ఉంది.

Similar News

News November 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ బుగ్గారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఒకేరోజు ముగ్గురి మృతి.
@ కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వాసుపత్రులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.
@ జగిత్యాల రూరల్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం.
@ మేడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు.
@ తంగళ్లపల్లి మండలంలో కారును ఢీకొన్న లారీ.

News November 27, 2024

సంక్షేమ హాస్టళ్లకు సన్న రకం బియ్యం అందిస్తాం: మంత్రి ఉత్తమ్

image

సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. KNR జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న రకాల వడ్ల కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.

News November 27, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.