News July 28, 2024
బొత్స వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కొండపల్లి

నెల్లిమర్ల మండలం ధనాలపేటలో మాజీ సైనికుడు పతివాడ వెంకునాయుడు ఇంటిని కూల్చారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. అశోక్ బంగ్లాలో ధనాలపేట గ్రామస్థులతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం వలన మాత్రమే ప్రహరీ గోడ కూల్చడం జరిగిందన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Similar News
News January 20, 2026
VZM: ప్రేమ పేరుతో బాలికను మోసం.. 20 ఏళ్ల జైలు

ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంగళవారం తీర్పునిచ్చింది. బొబ్బిలి (M) గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ అనే యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తేలడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు.
News January 20, 2026
‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
News January 20, 2026
VZM: 26 నుంచి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన స్పెషల్ డ్రైవ్

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 26 నుంచి మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వాములుగా పనిచేయాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాల కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.


