News July 28, 2024
ఒలింపిక్స్‌తో సత్తా చాటిన తెలుగమ్మాయి

ఒలింపిక్స్‌లో తెలుగు తేజం ఆకుల శ్రీజ సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ 64వ రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించారు. వరుసగా 4 గేమ్స్ గెలిచి శభాష్ అనిపించారు. 11-4, 11-9, 11-7, 11-8తో సునాయసంగా విజయం సాధించారు. దీంతో శ్రీజ 32వ రౌండ్‌కు అర్హత సాధించారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 26, 2026
మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్..! ఆమె సేఫేనా?

AP: కర్నూలులో ఈనెల 9న నర్సు HIV ఇంజెక్షన్ ఇచ్చిన లేడీ డాక్టర్‌కు వైరస్ సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలిపారు. వసుంధర గతనెల 28న వైరస్ బ్లడ్ సేకరించి ఫ్రిజ్‌లో ఉంచడంతో అన్ని రోజులు వైరస్ బతకదన్నారు. కానీ రక్త గ్రూప్ తదితరాలతో ముప్పుపై అప్రమత్తత అవసరమని చెప్పారు. వసుంధర ప్రేమించిన డాక్టర్ మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోగా, అతడిని సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించి ఇంజెక్షన్ ఇవ్వడం తెలిసిందే.
News January 26, 2026
20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.
News January 26, 2026
గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


