News July 28, 2024
పొదలకూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించాలంటూ ఓ ప్రేమజంట పొదలకూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రేమికులు దిండు మనోజ్, పులి మాధురి మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రేమించుకొని గూడూరులోని నరసింహస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తమ తల్లిదండ్రులు ఏ క్షణంలోనైనా దాడి చేసి హత్య చేస్తారన్న భయంతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించామన్నారు. ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ప్రేమ జంట కోరింది.
Similar News
News July 9, 2025
నెల్లూరులో స్తంభిస్తున్న ట్రాఫిక్

నెల్లూరు రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈక్రమంలో వాహనాల రద్దీ అధికమవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రధానంగా వెంకటేశ్వరపురం బ్రిడ్జి, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్, అయ్యప్పగుడి – RTC మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు.
News July 9, 2025
నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News July 9, 2025
ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..!

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి. తెలుగు మహిళలు పలుచోట్ల ఆందోళనలు చేసి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ఉదయం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసన్నపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.