News July 28, 2024
గోదావరి, కృష్ణా నదుల మహోగ్రరూపం

గోదావరి, కృష్ణా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. 15.33 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873 అడుగులుగా ఉంది. రేపు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
2012లో భూపాలపల్లి నగర పంచాయితీ

భూపాలపల్లి నగర పంచాయతీ ఏర్పాటుకు సరిపడా జనాభా లేకపోవడంతో సమీపంలోని జంగేడు, వేశాలపల్లి, కాశీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాలను విలీనం చేశారు. ఫలితంగా పట్టణ జనాభా 29 వేల పైచిలుకు చేరుకుంది. దీంతో 2012లో భూపాలపల్లిని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో జిల్లా కేంద్రంగా, 2017లో భూపాలపల్లి గ్రేడ్- 3 మున్సిపాలిటీగా ఏర్పడింది.
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<


