News July 28, 2024

ఒలింపిక్స్ దుస్తులు సౌకర్యంగా లేవు: గుత్తా జ్వాల

image

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన క్రీడాకారులకు ఇచ్చిన దుస్తులు సౌకర్యవంతంగా లేవని ఇండియన్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఆరోపించారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘దుస్తులు నాసిరకంగా ఉండటంతో చిరిగిపోతున్నాయి. వాటిపై మన కళలను ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా డిజైనర్లు ఆ పని చేయలేదు. భారత బృందం కోసం తయారు చేసిన చీరలు, సూట్స్ నన్ను తీవ్ర నిరాశపరిచాయి’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10

image

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>

News September 19, 2025

సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

image

పాకిస్థాన్‌పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.

News September 19, 2025

MANUUలో టీచింగ్ పోస్టులు

image

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<>MANUU<<>>) 13 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ/ఎంఏ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500.