News July 28, 2024
కథలాపూర్: వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం

కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో తిరుమలేష్ (18) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. తిరుమలేష్ గత మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 28, 2025
జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 28, 2025
KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.