News July 29, 2024
జిల్లాలోని పర్యాటక కేంద్రాల వివరాలు అందజేయాలి: జేసీ

జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వాటి వివరాలను సంపూర్ణంగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఆదివారం జిల్లా పర్యాటక శాఖ ఏడీ, నడిమింటి నారాయణరావు తన సిబ్బందితో కలిసి జేసీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన జిల్లాలో పర్యాటక కేంద్రాలతోపాటు పలు చారిత్రక ఆలయాలు ఉన్నాయని వాటి వివరాలు తెలపాలన్నారు.
Similar News
News September 17, 2025
టెక్కలి: జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.
News September 17, 2025
నరసన్నపేట: తాగునీటి వెతలు తప్పవా..

నరసన్నపేట మేజర్ పంచాయతీలో తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రజలు గత రెండు రోజులుగా తాగేనీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఫలితం వల్లే తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని, పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందని, రోజుల తరబడి తాగునీటికి ప్రజలు ఎదురు చూడడం పరిపాటిగా మారిందని అంటున్నారు.
News September 16, 2025
SKLM: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలను సీఎం వివరిస్తూ, ఆయా జిల్లాలలో ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో కొన్నిటిని అమలు చేశామని తెలియజేశారు.