News July 29, 2024

ఢిల్లీలో మంచిర్యాల జిల్లా యువతి మృతి

image

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News October 31, 2025

ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్‌లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్‌వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

ఆదిలాబాద్: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

News October 30, 2025

ADB: కేయూ ఫీజు గడువు పెంపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును మరొకసారి పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. అదే అపరాధ రుసుముతో NOV 03 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.