News July 29, 2024

బాంబుల మోత.. వణికించే చలిలో నడిరోడ్డుపై ప్రసవం

image

ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గాజాలో సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఇళ్లు పోయి, బిడ్డల్నికోల్పోయి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఆలా అనే మహిళ ఈ ఏడాది జనవరిలో వణికించే చలిలో రోడ్డుపైనే ప్రసవించారు. నాడు పడ్డ బాధలను ఆమె తాజాగా వెల్లడించారు. ఇప్పటికీ బిడ్డలకు ఆహారం పెట్టలేక అర్ధాకలితో పడుకుంటున్నామని, నిరాశ్రయులమై రోడ్డున పడ్డామంటూ కంటతడి పెట్టారు.

Similar News

News January 12, 2026

మేడారం: మహిళలకు ప్రత్యేకంగా మొబైల్ మరుగుదొడ్లు

image

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని అధికారులు మహిళా భక్తుల కోసం మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో మహిళలు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడవద్దని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు మొబైల్ టాయిలెట్ బస్సులను మేడారంలో ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

News January 12, 2026

Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

image

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

News January 12, 2026

డీఏపై జీవో విడుదల

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.