News July 29, 2024

ఆ గిరిజనులు చాలా గ్రేట్: ప్రధాని మోదీ

image

APలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధాని మోదీ అభినందించారు. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవల గురించి ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారని మన్‌కీబాత్‌లో వెల్లడించారు. టైగర్ ట్రాకర్స్‌గా వారు పనిచేస్తున్నారని, వన్యప్రాణుల ప్రతి చిన్న కదలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపైనా నిఘా ఉంచినట్లు మోదీ వివరించారు.

Similar News

News September 15, 2025

యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

image

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్‌(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం

News September 15, 2025

భారత్-పాక్ మ్యాచ్‌.. ICCకి PCB ఫిర్యాదు

image

భారత్‌, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.

News September 15, 2025

విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

image

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.