News July 29, 2024
ఖమ్మం: పనిచేస్తూ పొలంలో ప్రాణాలు విడిచాడు

వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లి ఓ వ్యక్తి మూర్చతో పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడుకి చెందిన సైదులు (42) ఆదివారం గ్రామంలోని ఓ రైతు వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లాడు. సైదులుకు మూర్చ రావడంతో బురదలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 28, 2026
బోధనలో సాంకేతికతను జోడించాలి: డీఈఓ చైతన్య జైనీ

నిత్య బోధనా ప్రక్రియలో సమాచార భావ ప్రసార సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని డీఈఓ చైతన్య జైని ఉపాధ్యాయులకు సూచించారు. ఖమ్మంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2రోజుల ఐసీటీ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గూగుల్ ఫార్మ్స్, షీట్లు, స్లైడ్ల వంటి డిజిటల్ సాధనాలను బోధనలో భాగం చేయడం ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని తెలిపారు.
News January 28, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచి అమల్లోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా సాగించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పెంచామన్నారు.
News January 28, 2026
ఖమ్మంలో కేజీ బీన్స్ రూ.50, చామగడ్డ రూ.36

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.30, బెండకాయ రూ.46, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.50, బీరకాయ రూ.46, సొరకాయ రూ.20, దొండకాయ రూ.60, క్యాబేజీ రూ.24, ఆలుగడ్డ రూ.18, చామగడ్డ రూ.36, క్యారెట్ రూ.30, కీరదోస రూ.26, బీన్స్ రూ.50, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు రూ.35, కోడిగుడ్లు(12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.


