News July 29, 2024
SRSP అప్డేట్: 17,310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో మెల్లగా పెరుగుతోంది. నిన్న 24 గంటల్లో 16,840 క్యూసెక్కుల నీరు రాగా సోమవారం ఉదయం 9 గంటలకు 17,310 క్యూసెక్కులకు పెరిగింది. ఔట్ ఫ్లోగా 644 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1075.3 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Similar News
News March 5, 2026
నిజామాబాద్: భక్తుల ముంగిటకే భద్రాద్రి తలంబ్రాలు

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 5, 2026
NZB: జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచించారు.