News July 29, 2024

Olympics: లక్ష్యసేన్ విజయం ‘డిలీట్’

image

తొలి మ్యాచ్‌లో విజయం సాధించినా భారత షట్లర్ లక్ష్యసేన్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గ్వాటెమాలాకు చెందిన కెవిన్‌పై లక్ష్యసేన్ గెలిచారు. కానీ తన తర్వాతి మ్యాచ్‌ ఆడకుండానే కెవిన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. దీంతో లక్ష్యసేన్-కెవిన్ మ్యాచ్‌ను IOC రద్దు చేసింది. తదుపరి మ్యాచ్‌ల రిజల్ట్స్‌ను బట్టి లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు.

Similar News

News March 3, 2025

వివాదాస్పద జీన్స్.. వేలంలో రూ.31 లక్షలు

image

ఇటీవల వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలో మాగ్నస్ కార్ల్‌సన్ జీన్స్ ధరించడం <<15001679>>వివాదాస్పదమైంది<<>>. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించకపోవడంతో FIDE జరిమానా విధించింది. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ జీన్స్‌ను కార్ల్‌సన్ తాజాగా వేలం వేశారు. దానికి 94 బిడ్లు రాగా ఓ వ్యక్తి రూ.31 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ ఛారిటీకి మాగ్నస్ అందజేయనున్నారు.

News March 3, 2025

దేశంలో మహిళలకు 48% పెరిగిన JOBS

image

దేశంలో 2024తో పోలిస్తే 2025లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగాయని foundit తెలిపింది. ఎమర్జింగ్ టెక్నాలజీ రోల్స్ సహా IT, BFSI, తయారీ, హెల్త్‌కేర్ రంగాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసినట్టు పేర్కొంది. ‘భారత జాబ్ మార్కెట్ రాకెట్ వేగంతో పెరుగుతోంది. స్త్రీలకు యాక్సెస్, ఆపర్చునిటీస్ గణనీయంగా పెరిగాయి’ అని ఫౌండిట్ VP అనుపమ తెలిపారు. ఆఫీసుల్లో వారి కోసం ఏర్పాట్లు 55% మేర పెరగడం గుర్తించామన్నారు.

News March 3, 2025

ఏపీ ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కేంద్రమంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, దాన్ని అడ్డుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!