News July 29, 2024

అనంతలో పాప మిస్సింగ్ ఘటనలో నలుగురిపై వేటు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాప మిస్సింగ్ వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. వార్డులో రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు స్టాఫ్ నర్సులు శ్రవణమ్మ, సువర్ణమ్మలను సస్పెండ్ చేశారు. ఎఫ్ఎన్‌ఓ సుజాత, మహిళా సెక్యూరిటీ గార్డు సునీతను విధుల నుంచి తొలగించినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు.

Similar News

News October 1, 2024

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సవిత

image

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతీ, యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నామని, ఆ డిజైన్లపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణతో సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.

News September 30, 2024

అనంతపురం: 46 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

అనంతపురం జిల్లాలో మంచి పనితీరు కనబర్చిన 46 మంది పోలీసు సిబ్బందికి SP జగదీష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు పడేలా, హత్యా కేసుల్లో యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు సహకరించడం, ఏటీఎం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేశారన్నారు.

News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.