News July 29, 2024
చేజర్ల మండలంలో క్షుద్ర పూజలు కలకలం

చేజెర్ల మండలం కండాపురం గ్రామ సమీపంలో నీ వాగు వద్ద సోమవారం క్షుద్ర పూజాలు కలకలం రేపుతున్నాయి. గ్రామ సమీపంలో వాగు వద్ద ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి పూజలు. చుట్టూ ముగ్గు వేసి, పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు పెట్టి ఉన్నారు. ఈ క్షుద్ర పూజలను చూసిన గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్ షాప్స్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.
News November 12, 2025
నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.
News November 12, 2025
HYD ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు.. నెల్లూరు వాసి అరెస్ట్

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో CISF అధికారులు అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అబుదాబీ నుంచి HYD వచ్చిన నెల్లూరు వాసి జయరాం సూర్యప్రకాశ్, చెన్నై వాసి మహమ్మద్ జహంగీర్ లగేజీలను చెక్ చేయగా సుమారు రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. 8 డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్స్ పరికరాలు, డ్రోన్స్‌ను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.


