News July 29, 2024

ఒలింపిక్స్ ప్రారంభ వేడుక.. వెడ్డింగ్ రింగ్ కోల్పోయిన గోల్డ్ మెడలిస్ట్

image

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, ఇటాలియన్ హై జంపర్ జియాన్‌మార్కో టాంబేరి మరోసారి వార్తల్లో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ఆయన తన వెడ్డింగ్ రింగ్‌ను కోల్పోయారు. ప్రారంభ వేడుకల్లో తమ దేశ జెండాను ప్రదర్శిస్తుండగా ప్రమాదవశాత్తు తన వేలి ఉంగరం సేన్ నదిలో పడిపోయినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈక్రమంలో తన భార్య చియారా బొంటెంపి టాంబేరికి ఆయన క్షమాపణలు చెప్పారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News November 10, 2025

అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 10, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News November 10, 2025

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.