News July 29, 2024

గత పాలకుల వల్ల ప్రభుత్వానికి రూ.9వేల కోట్ల నష్టం: సీఎం

image

TG: BHELకి గత పాలకులు టెక్నాలజీ వర్కులు కట్టబెట్టడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘బీహెచ్ఈఎల్‌ ఒక ఎలక్ట్రికల్ తయారీ సంస్థ. అంతకు ముందు సివిల్ పనులు ఎప్పుడైనా చేసిందా? ఆ సంస్థతో వీరు సివిల్ ఒప్పందాలు చేసుకున్నారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంగా రూ.9వేల కోట్ల వరకు సర్కారుకు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 27, 2024

మాటలు తక్కువ.. పని ఎక్కువ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.

News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.

News December 27, 2024

సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.