News July 29, 2024
ఉద్యోగులకు గుడ్‌న్యూస్
AP: సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది.
Similar News
News February 1, 2025
బీజేపీకి మంత్రి సీతక్క కౌంటర్
సోనియా గాంధీ రాష్ట్రపతిని అవమానించారన్న BJP <<15320224>>విమర్శలపై<<>> మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘అసలు సమస్యలను దారి మళ్లించడం, కృత్రిమ వివాదాలను సృష్టించడమే BJP ఎజెండా. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని పక్కన పెట్టిన వారికి ఆదివాసీల గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ట్వీట్ చేశారు.
News February 1, 2025
చరిత్ర సృష్టించనున్న నిర్మల
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.
News February 1, 2025
వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు
TG: అంగన్‌వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.