News July 29, 2024

పార్వతీపురం: మైనార్టీలకు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మైనార్టీ అభ్యర్థులకు టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేయడానికి చర్యలు చేపట్టామని మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ రాజు తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ అభ్యర్థులకు ఈ శిక్షణ అందజేసేలా ప్రభుత్వం ఆదేశించిందన్నారు. విశాఖలోని ఆర్.సి.ఈ.డి.ఎం. సిరిపురంలో శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టమన్నారు. మరిన్ని వివరాలకు 90523 42344 సంప్రదించాలన్నారు.

Similar News

News January 12, 2026

VZM: ‘పీజీఆర్ఎస్‌ని ప్రజలు వినియోగించుకోవాలి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 11, 2026

VZM: ఆకాశమే హద్దు.. పతంగులతో పిల్లల ఆటలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిల్లల్లో పతంగులు ఎగరవేయాలనే ఉత్సాహం పెరిగింది. రంగురంగుల పతంగులు, మాంజా దారాల కొనుగోలులో పిల్లలు బిజీగా ఉన్నారు. మైదానాలు, ఇంటి టెర్రస్‌లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. గాజు మాంజా వాడకూడదని విజయనగరం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగల దగ్గర పతంగులు ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

News January 11, 2026

VZM: 63 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) మొత్తం 63 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.