News July 29, 2024
75% రిజర్వేషన్ల చట్టం: స్టే ఇవ్వని సుప్రీం
విద్య, ఉపాధిలో 75% రిజర్వేషన్లు చెల్లవన్న బిహార్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. రాష్ట్ర Govt వేసిన 10 పిటిషన్లను విచారిస్తామంది. గత నవంబర్‌లో నితీశ్ Govt SC, ST, BCల కోటాను 50-65%కు పెంచింది. EWS కోటా 10% దీనికి అదనం. ఇది ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వపు హక్కును ఉల్లంఘిస్తోందన్న పౌరుల పిటిషన్లతో హైకోర్టు పైతీర్పు ఇచ్చింది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం తీర్పును ఉటంకించింది.
Similar News
News February 1, 2025
వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు
TG: అంగన్వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.
News February 1, 2025
అవును.. చైనా ల్యాబ్ నుంచే కొవిడ్ వచ్చింది: అమెరికా
చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘కొవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదు’ అని పేర్కొన్నారు.
News February 1, 2025
పన్ను వసూళ్లలో నంబర్‌వన్‌గా తెలంగాణ
TG: పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సొంత పన్ను వసూళ్లు 88 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే జల్ జీవన్ మిషన్‌ను వంద శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నట్లు తెలిపింది. ఐటీ సేవలతో దేశంలో కర్ణాటక, తెలంగాణ ముందున్నాయని పేర్కొంది.