News July 29, 2024

మెరూన్ డ్రెస్‌లో ప్రభాస్.. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా?

image

మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజా సాబ్’ సినిమా నుంచి నిన్న రిలీజైన పోస్టర్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెరూన్ రంగు సూట్‌తో కనిపించారు. దీంతో ఆ కలర్ డ్రెస్సులతో ప్రభాస్‌ నటించిన సినిమాలను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ‘బాహుబలి’తో పాటు ‘కల్కి’ సినిమాలోనూ ప్రభాస్ మెరూన్ రంగు డ్రెస్‌ ధరించగా రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇదే ట్రెండ్ ‘రాజా సాబ్’లోనూ కంటిన్యూ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Similar News

News April 1, 2026

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్

image

TG: విద్యుత్ వినియోగదారులందరికీ శుభవార్త. 2026లో గృహ అవసరాలకు వాడే విద్యుత్‌కు ఛార్జీల పెంపు లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నాన్- డొమెస్టిక్ వినియోగదారులకు పీక్ అవర్స్‌లో వర్తించే ToD (Time of Day) ఛార్జీని యూనిట్‌కు రూ.1 నుంచి రూ.1.50కి పెంచింది. అటు కరెంట్ షాక్‌కు గురైన వారికి అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.

News April 1, 2026

రేపు ప్రధానితో లోకేశ్ భేటీ

image

AP: మంత్రి లోకేశ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉ.10.30 గం.కు ప్రధాని మోదీని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను మొత్తం టీవీలో చూశానని లోకేశ్ తెలిపారు. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ తాక‌లేడని స్పష్టం చేశారు.