News July 29, 2024
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు
సింహాచలం ఆలయంలో హుండీలలో ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 34 రోజులకు రూ.1,97,06,300 ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. బంగారం 100 గ్రాముల 950 మిల్లీగ్రాములు, వెండి 11 కిలోల 800 గ్రాములు లభించినట్లు పేర్కొన్నారు. 163 యూఎస్ఏ డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లుతో పాటు పలు దేశాల కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వెల్లడించారు.
Similar News
News January 19, 2025
భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు
వైసీపీ అధినేత జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను, పరిశీలకులను మారుస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను)ని నియమించారు. మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు.
News January 18, 2025
శాసనసభ స్థానాల్లో వైసీపీ పరిశీలకుల నియామకం
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు శాసనసభ స్థానాలకు పరిశీలకులను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గాజువాక సమన్వయకర్తగా దేవం రెడ్డి, భీమిలి సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, చోడవరం సమన్వయకర్తగా అమర్నాథ్, మాడుగుల సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడును అధిష్టానం నియమించింది.
News January 18, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి శనివారం పాలాభిషేకం చేశారు. ముందుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన అమృతరావు విగ్రహానికి జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.