News July 29, 2024
అగ్నిపథ్: రాహుల్ X రాజ్‌నాథ్

అగ్నిపథ్‌పై రాహుల్, రాజ్‌నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.
Similar News
News April 6, 2026
CEC జ్ఞానేశ్ కుమార్‌కు రాజ్యసభలో ఊరట

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. కాగా CEC తొలగింపునకు డిమాండ్ చేస్తూ ఈ తీర్మానంపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. సీఈసీ బీజేపీకి ఫేవర్‌గా నడుచుకుంటున్నారని ఆరోపిస్తూ ఉభయసభల్లోనూ ఈ అభిశంసనపై ప్రతిపక్ష నేతలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా లోక్‌సభలో ఈ తీర్మానం ఇంకా పెండింగ్‌లో ఉంది.
News April 6, 2026
డిసెంబర్‌లో మహిళలకు చీరలు: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. వారికి డిసెంబర్‌లో చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ ‘గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. పాల పిట్టల్లా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి చిలక పచ్చ రంగు చీరలకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నా. పుట్టింటి సారెలా ఆడబిడ్డలకు చీరలు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
News April 6, 2026
వర్షంతో ఆగిన మ్యాచ్

ఈడెన్ గార్డెన్స్‌లో KKR, PBKS మ్యాచ్ వర్షంతో ఆగింది. 3.4 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. భారీ వాన పడుతుండటంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి KKR స్కోర్ 25-2గా ఉంది. అలెన్ 6, గ్రీన్ 4 పరుగులు చేసి బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఔటయ్యారు.


