News July 29, 2024
రేవంత్ పీసీసీ అయినా.. సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే: హరీష్ రావు

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయని అన్నారు.
Similar News
News March 2, 2026
MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.
News March 2, 2026
ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం హాజరు

జిల్లాలో ఐదవ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర బోటనీ I, పొలిటికల్ సైన్స్-1, మ్యాథ్స్ -1A పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. 95.55 శాతంగా జనరల్ విభాగంలో 6706 గాను 6401 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 612 గాను 592 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
News March 2, 2026
రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.


