News July 29, 2024
గోదావరి స్వరూపం తెలుసా?
దక్షిణ గంగగా పేరొందిన గోదావరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ, ఏపీ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై MHలో జయక్వాడీ, బాబ్లీ, తెలంగాణలో శ్రీరాంసాగర్, కడెం, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీలో పోలవరం పూర్తయితే అది అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించనుంది. ఈ నదికి ప్రాణహిత నుంచి భారీ ప్రవాహం వస్తుంది. ఈ నది ఒడ్డున నాసిక్, బాసర, ధర్మపురి, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి.
Similar News
News February 1, 2025
బీమా రంగంలో FDI 100 శాతానికి పెంపు
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిధిని ప్రస్తుతమున్న 74శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. FDI విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సమీక్షించి మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, మొత్తం ప్రీమియాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్ చేసే బీమాదారులకు ఇది వర్తించనుంది. దీని ద్వారా బీమా రంగం మరింత బలోపేతమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు వివరిస్తున్నారు.
News February 1, 2025
క్యాన్సర్ మందులపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
కస్టమ్స్ డ్యూటీలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాన్సర్, ఇతర ప్రమాదకర వ్యాధుల మెడిసిన్లపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.
News February 1, 2025
2047కల్లా 100 GW అణు విద్యుత్ లక్ష్యం: నిర్మల
2047కల్లా కనీసం 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘చిన్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రూ.20వేలకోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.