News July 29, 2024

కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం.. కేసు సీఐడీకి బదిలీ

image

TG: కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ.1,000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాజీ సీఎస్, అప్పటి వాణిజ్య పన్నుల కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు.

Similar News

News February 1, 2025

BUDGET 2025: రైతులకు మరో గుడ్‌న్యూస్

image

రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5Lకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు.

News February 1, 2025

లాభాల్లో ట్రేడ్ అవుతున్న రైల్వే స్టాక్స్

image

బడ్జెట్ ముంగిట రైల్వే స్టాక్స్ ఊపందుకున్నాయి. భారీ కేటాయింపులుంటాయన్న అంచనాలతో దూసుకెళ్తున్నాయి. IRFC Ltd, RVNL Ltd, IRCON International Ltd, RailTel Ltd, IRCTC వంటి షేర్లు 4శాతానికిపైగా లాభపడ్డాయి. జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 19.67 శాతం మేర, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55శాతం, టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ 13.27శాతం మేర లాభాల్ని చూస్తున్నాయి.

News February 1, 2025

పోర్న్ స్టార్ మృతి

image

బ్రెజిల్ పోర్న్ స్టార్ అన్నా బిట్రిజ్ పెరీరా (అన్నా పోలీ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు సహ నటులతో పోర్న్ ఫిల్మ్ షూటింగ్ ముగిశాక ఈ 27 ఏళ్ల నటి బిల్డింగ్ నుంచి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరు సహ నటులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో కుట్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారు.