News July 29, 2024

బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో కృతి సనన్?

image

హీరోయిన్ కృతి సనన్ బిజినెస్‌మ్యాన్ కబీర్ బహియాతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్‌లో ఒకే ఈవెంట్‌లో కనిపించారు. ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్‌తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్‌లో కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్‌లో 2024 న్యూఇయర్ వేడుకల్లోనూ వీరిద్దరూ కలిసి కెమెరాకు చిక్కారు.

Similar News

News February 1, 2025

బిహార్‌కు వరాల జల్లు

image

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది.
*బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు
*బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
*నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
*పట్నా విమానాశ్రయం విస్తరణ
*బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు

News February 1, 2025

ఫుట్‌వేర్ సెక్టార్‌కు కొత్త స్కీమ్.. 22 లక్షల మందికి ఉపాధి

image

ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్‌లో ఉత్పత్తి, నాణ్యతను మెరుగుపరించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాద రక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని చెప్పారు.

News February 1, 2025

BUDGET 2025-26: ముఖ్యాంశాలు

image

*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు