News July 29, 2024
ALERT: వణికిస్తున్న ఒరోఫూట్స్ వైరస్
దోమకాటుతో సోకే ఒరోఫూట్స్ వైరస్ 5 దేశాలను వణికిస్తోంది. బ్రెజిల్, బొలీవియా, పెరూ, క్యూబా, కొలంబియాలో ఈ ఏడాది 7700 కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్రెజిల్లోనే 7236 మందికి సోకింది. తాజాగా ఇద్దరు మరణించడంతో ప్రమాద ఘంటికలు మోగాయని అక్కడి అధికారులు భయపడుతున్నారు. ఈ రోగుల్లో తీవ్ర జ్వరం, వణుకుడు, తల, కీళ్ల నొప్పి సహా డెంగ్యూ లక్షణాలు ఉంటాయి. కొందరిలో చిగుళ్లు, ముక్కులోంచి రక్తం కారుతుంది. ఇది అంటువ్యాధి కాదు.
Similar News
News February 1, 2025
BUDGET: స్కూల్ స్టూడెంట్స్ కోసం ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’
ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్‌లో ఆసక్తి, సృజన, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ పెంచుతాయని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
News February 1, 2025
BIG NEWS: కొత్త ఆదాయ పన్ను చట్టం
ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు.
News February 1, 2025
బిహార్‌కు వరాల జల్లు
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది.
*బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు
*బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
*నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
*పట్నా విమానాశ్రయం విస్తరణ
*బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు