News July 29, 2024

ధవళేశ్వరం వద్ద 14.60 అడుగులకు చేరిన నీటిమట్టం

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల వరకు 14.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 14.60 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3 పంట కాలువల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Similar News

News August 25, 2025

కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి కందుల

image

నిడదవోలులో QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్ అధికారులతో కలిసి కార్డుల పంపిణీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనర్హులను తొలగించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని,అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు.

News August 25, 2025

నేడు 5,57,710 డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

image

నిడదవోలులో సోమవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి మండలంలో స్థానిక ప్రతినిధుల ఆధ్వర్యంలో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 5,57,710 డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు.

News August 24, 2025

పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలి: ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు నెలకు సంబంధించి అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆదివారం నెలవారి నేర సమీక్షను తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గంజాయి కేసుల్లో పాత నిందుతులను కచ్చితంగా రీ విజిట్ చేయాలన్నారు. పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూలు త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు.