News July 29, 2024
‘కడప జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ జరగాలి’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానం జిల్లాలో సజావుగా, సులభతరంగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం వీసీ ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.
Similar News
News July 5, 2025
కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.
News July 5, 2025
కడప: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్పై విచారణ

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.
News July 5, 2025
పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.