News July 29, 2024
రాజకీయ స్వార్థం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు: YCP

AP: రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూటమి ప్రభుత్వం తీసివేసిందని YCP ట్వీట్ చేసింది. ‘సమగ్ర సర్వే విషయంలో యూటర్న్ తీసుకున్నారంటే దాని అర్థం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అంగీకరించినట్టే. ఈ యాక్ట్ అమలు ప్రక్రియలో సర్వే కూడా భాగమే. పథకాల పేర్లు మారిస్తేనో, బొమ్మలు తీసేస్తేనో ప్రజలకు అన్నీ చేసినట్టు కాదు. దీనివల్ల రైతులకు ఒనగూరిందేమీ లేదు’ అని పేర్కొంది.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


