News July 29, 2024
ఒక విద్యా సంస్థకు సినారె పేరు పెడతాం: సీఎం రేవంత్
TG: డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలంగాణ వారైనప్పటికీ యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని సీఎం రేవంత్ అన్నారు. సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు ఆయన పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సినారె 93వ జయంతి సందర్భంగా HYDలో తమిళ రచయిత్రి శివశంకరికి ‘విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం చేశారు.
Similar News
News February 1, 2025
పాత Income Tax పద్ధతికి ఇక గుడ్‌బై!
కొత్త Income Tax విధానంలో రూ.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా ₹2.5L వరకు 0, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L- ₹5L వరకు 5%, ₹5L- ₹10L వరకు 20%, ₹10L పైన 30% వద్దే ఉంచేశారు. ఇందులో బెనిఫిట్స్ రావాలంటే HRA, హోమ్ లోన్స్, SEC 80C కింద క్లెయిమ్స్ చేసుకోవాలి. లేదంటే రూ.వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సిందే. అందుకే కొత్త ITకే అందరూ మొగ్గు చూపడం ఖాయం.
News February 1, 2025
Income Tax: ఎవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..
కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శ్లాబుల ప్రకారం ₹8L ఆదాయముంటే ₹30K, ₹9Lకు ₹40K, ₹10Lకు ₹50K, ₹11Lకు ₹65K, ₹12Lకు ₹80K పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు SD, రిబేటుతో కలిపి ₹12.75L వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి ₹16Lకు ₹50K, ₹20Lకు ₹90K, ₹24Lకు ₹1.10L, ₹50Lకు ₹1.10L మేర ట్యాక్స్ బెనిఫిట్ కల్పించారు. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.
News February 1, 2025
నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం
TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.