News July 29, 2024
NZB: జిల్లాలో ఈరోజు TOP NEWS
* నిజామాబాద్: డయల్ 100 పై నిర్లక్ష్యం.. ఎస్ఐ అశోక్ పై వేటు
* పెద్దకొడప్గల్: 2018 నుంచి కాటేపల్లి తండాకు సర్పంచ్ లేరు
* పిట్లం: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి
* నిజామాబాద్: 14.5 కిలోల వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
* నిజాంసాగర్: మంత్రి తుమ్మలకు జుక్కల్ ఎమ్మెల్యే లేఖ
* బిచ్కుందలో రోడ్ల కోసం మోకాళ్లపై కూర్చొని నిరసన
Similar News
News February 7, 2025
NZB: చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్
బైకు చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాయన్న బైక్ ఈనెల 5వ తేదీన చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మనోహరాబాద్‌లో రాకేశ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బైకును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
News February 7, 2025
NZB: CPకి MIM నాయకుల వినతి
రంజాన్ నేపథ్యంలో అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని కోరుతూ MIMనాయకులు గురువారం నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధూశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు.
News February 7, 2025
చౌడమ్మ కొండూరులో పోటెత్తిన భక్తజనం
నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయం పునర్నిర్మించి నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఇవాళ చండీ హోమం నిర్వహించారు. చుట్టుపక్కల ఉమ్మడి మండలంలోని భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారి ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.