News July 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 30, 2024

₹21 వేల కోట్ల‌కు డిఫెన్స్ ఎగుమతులు: రాజ్‌నాథ్

image

ద‌శాబ్ద కాలంలో డిఫెన్స్ ఎగుమతులు ₹2 వేల కోట్ల నుంచి ₹21 వేల కోట్ల‌కు పెరిగాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయ‌న మాట్లాడుతూ 2029 నాటికి ₹50 వేల కోట్ల ఎగుమ‌తులు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వెల్ల‌డించారు. AI, సైబ‌ర్‌, స్పేస్ ఆధారిత స‌వాళ్లు అధిక‌మ‌వుతున్న నేపథ్యంలో సైన్యం వీటిని ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌మై ఉండాలన్నారు. మహూలో శిక్షణ కేంద్రాల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారు.

News December 30, 2024

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడంటే?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.

News December 30, 2024

శివాజీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంత‌రాలు!

image

లద్దాక్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై తమ అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్ణ‌యం స్థానికుల్ని అసంతృప్తికి గురి చేసింద‌ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్ర‌త్యేక వాతావ‌ర‌ణం-వైల్డ్‌లైఫ్‌కి విగ్ర‌హ ఏర్పాటుకు ఉన్న సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల్ని, ప్ర‌కృతికిని గౌర‌వించే ప్రాజెక్టుల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని స్థానికులు కోరుతున్నారు.