News July 30, 2024
2న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూఅక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Similar News
News April 13, 2026
హార్ముజ్‌లో హై టెన్షన్.. చిక్కుకున్న 15 భారత నౌకలు

హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం 15 భారత నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో LPG, LNG, చమురు, కెమికల్ ట్యాంకర్లు ఉండటంతో దేశీయంగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని గమనిస్తున్న ఇండియన్ నేవీ 6 యుద్ధనౌకలను రంగంలోకి దించి సమన్వయం చేస్తోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవడంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం హార్ముజ్‌లో మళ్లీ హై టెన్షన్‌కు కారణమైంది.
News April 13, 2026
విజయశాంతిరెడ్డి ఆత్మహత్య.. భర్త సంచలన ఆరోపణలు

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండు నెలల కిందట పిల్లలతో కలిసి <<19059157>>ఆత్మహత్య<<>> చేసుకున్న విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య కుటుంబీకుల వేధింపుల వల్లే వారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ‘నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారు. విజయ చనిపోయిన నాటి నుంచి ఆస్తుల కోసం నన్ను వేధించారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి’ అని పోలీసులను కోరారు.
News April 13, 2026
మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.


