News July 30, 2024
జగన్ కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: వర్ల రామయ్య

AP: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లి ఏదో చేయాలని చూసి అబాసు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. ‘జగన్ రూ.43వేల కోట్లు కొట్టేశారని సీబీఐ చెప్పింది. అందుకే 16 నెలలు బెయిల్ రాలేదు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఆయనకు మాట్లాడే నైతిక హక్కులేదు. ఆయన కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 28, 2025
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
News December 28, 2025
బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<


