News July 30, 2024
పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదు: SRC

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్న 5+5 భద్రతను కొనసాగించాలంటూ పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ(SRC) తేల్చిందని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి హైకోర్టుకు వివరించారు. SRC నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవాలని జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి ఆదేశించారు.
Similar News
News January 16, 2026
చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
News January 16, 2026
చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.
News January 15, 2026
రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


