News July 30, 2024
వరంగల్ జిల్లాలో విష జ్వరాలు

ఉమ్మడి WGL జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలతో కలిసి మొత్తం 1,300 పడకల వార్డులున్న MGMకు జిల్లాతో పాటు.. పొరుగు జిల్లాలు, AP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోగులు వస్తున్నారు. ప్రతిరోజు 50కి పైగా రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జులై నెలలలో ఇప్పటి వరకు PHCలలో 41,152 ఓపీ రోగులు రాగా.. 1,856జ్వరాలు, 29వాంతులు, విరేచనాలు, 6డెంగీ, 2మలేరియా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.
Similar News
News December 28, 2025
వరంగల్: రేపటి నుంచే ‘యూరియా యాప్’ అమలు

వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Fertilizer Booking App’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యాన్ని నివారించొచ్చని ఆమె పేర్కొన్నారు.
News December 28, 2025
వరంగల్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

జిల్లాలో గత ఆదివారంతో పోలిస్తే నేడు చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు చికెన్ విత్ స్కిన్ కేజీకి రూ.250 నుంచి రూ.270 పలకగా.. స్కిన్ లెస్ కేజీకి రూ.280 నుంచి రూ.300 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. ధరలు పెరగడంతో కొనుగోలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News December 28, 2025
WGL: ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో నగర అభివృద్ధికి బలమైన బాటలు పడతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.


