News July 30, 2024

లోక్‌సభలో బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

TG: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతోపాటు మరో 16 మందిని విప్‌లుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్‌గా పశ్చిమ్ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ శివ్ శక్తినాథ్ బక్షి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందించారు.

Similar News

News January 17, 2026

మళ్లీ సంక్రాంతికి వస్తాం!

image

భోగి నాడు మంటల వెలుగుల్లో బంధువులతో పంచుకున్న వెచ్చని మమతలు, సంక్రాంతి రోజు ఆరగించిన పిండి వంటల రుచులు, కనుమకు చేసిన సందడి జ్ఞాపకాలను మోసుకుంటూ జనం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. సెలవులు ముగియడంతో చదువులు, వృత్తి, వ్యాపారం రీత్యా పట్టణాల్లో స్థిరపడిన వారు బిజీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. అమ్మానాన్నలకు జాగ్రత్తలు చెప్పి, బంధువులు, స్నేహితులకు మళ్లొస్తామని హామీ ఇచ్చి సొంతూళ్లకు టాటా చెబుతున్నారు.

News January 17, 2026

323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<>(SAI<<>>) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 1-FEB15 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనడంతోపాటు కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sportsauthorityofindia.nic.in

News January 17, 2026

మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

image

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.