News July 30, 2024
కొలిక్కి వచ్చిన పీసీసీ చీఫ్ ఎంపిక?
TG: పీసీసీ చీఫ్ ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ వచ్చే నెల 2న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14న తిరిగి వస్తారు. ఆ తర్వాతే చీఫ్ పేరును ప్రకటించొచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లంబాడా సామాజికవర్గానికి చెందిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు పేర్కొన్నాయి. ఇక వెనుకబడిన వర్గాల నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
AP: కేంద్ర బడ్జెట్‌ను CM చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. PM మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు CM అభినందనలు చెప్పారు.
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr
News February 1, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.